తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ సర్కారే : గంగుల కమలాకర్​

  •  కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా?
  •  బీజేపీ, కాంగ్రెస్​కు ఓటు వేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం
  •  మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్​

కొత్తపల్లి, వెలుగు : రాష్ట్రంలో కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. నాలుగున్నరేళ్లు పత్తా లేని ఎంపీ బండి సంజయ్ ​ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నాడని ప్రశ్నించారు.  

గురువారం కొత్తపల్లి మండలం ఎలగందల్​, శ్రీరాములపల్లితోపాటు సిటీలోని 17,18,19 డివిజన్లలో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కొత్త సర్కార్​వచ్చాక శ్రీరాములపల్లిని జీపీ చేస్తానని హామీ ఇచ్చారు. 

50 ఏళ్ల తెలంగాణ దారిద్ర్యానికి బీజేపీ, కాంగ్రెస్​లే కారణమన్నారు. బీసీని సీఎం చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్న బీజేపీకి.. రాష్ట్రంలో రెండు సీట్లు కూడా రావన్నారు. గతంలో కాంగ్రెస్​ పాలనలో రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలు తీవ్రంగా ఉండేవని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. 

ALSO READ : కరెంటు కావాలా.. కాంగ్రెస్​ కావాలా.. కాంగ్రెస్,​ బీజేపీలను ఓడించండి : కేటీఆర్

10 ఏండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ గౌడ్, కార్పొరేటర్లు భాగ్యలక్ష్మి ప్రశాంత్, రాజశేఖర్, మాధవి కృష్ణ గౌడ్,  ఎంపీపీ శ్రీలత- మహేశ్​, జడ్పీటీసీ కరుణశ్రీ- రవీందర్, ఏఎంసీ చైర్మన్​ మధు, లీడర్లు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, మల్లేశం పాల్గొన్నారు.