- వేరే పార్టీల్లో ఆత్మగౌరవం చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు
- మంత్రి గంగుల కమలాకర్
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : ‘నిజమైన ఫూలే వారసుడు సీఎం కేసీఆరే..బీసీల ఆత్మగౌరవం కాపాడే పార్టీ టీఆర్ఎస్సే. దీన్ని పత్రి బీసీ లీడర్గుర్తించి టీఆర్ఎస్లో చేరాలె’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గొప్ప ఉద్యమకారులు, బీసీ నేతలైన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ లాంటి వారు టీఆర్ఎస్ లోకి రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.
శుక్రవారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని సంస్థాన్ నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో బీసీలకు ఇంతలా సేవ చేసిన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఆత్మగౌరవం ఉన్న బీసీ నేతలు ఇకనైనా వలసవాద, తెలంగాణకు సంబంధం లేని పార్టీల్లో ఉండే అవసరం లేదని, వారంతా టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు.