- ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు
- కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు నమోదు చేసిందని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అధికారం ఉందన్న ధీమాతో బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కరీంనగర్ 12వ డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీ కమాన్, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం స్థానిక కార్పొరేటర్ తోట రాములుతో కలిసి భూమిపూజ చేశారు.
అనంతరం గంగుల మాట్లాడుతూ న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఈ–ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం ఈ–ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచేలా కేటీఆర్ కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ప్రజల కోసం కొట్లాడేందుకైనా, జైల్లోకి వెళ్లేందుకైనా సిద్ధమేనన్నారు. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.