మంత్రి గంగులకు బీఫాం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫాంఅందుకున్నారు. కరీంనగర్‌‌లో ఆశీర్వాద సభ అనంతరం మంత్రి కేటీఆర్‌‌తో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన..  మూడోసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ బీఫాం అందుకున్నారు. 

వేములవాడ అభ్యర్థి చల్మెడకు..

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ ​వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు హైదరాబాద్‌లో బుధవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీఫాం అందజేశారు. చల్మెడ మాట్లాడుతూ బీఆర్​ఎస్​ అధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు.