కాంగ్రెస్ ముసుగులో .. తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం: గంగుల

కాంగ్రెస్ ముసుగులో .. తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం: గంగుల

ఆంధ్రా వాళ్ళు కాంగ్రెస్ ముసుగుతో వచ్చి తెలంగాణను మళ్లీ ఆంధ్రాతో కలపాలని చూస్తున్నారని మంత్రి గంగుల కామెంట్ చేశారు.  వచ్చే ఎన్నికల్లో అధికారం ఢిల్లీ చేతిలో కాదని. కేసీఆర్ చేతిలో పెట్టాలని కోరారు.  తెలంగాణ యువత భవిష్యత్తు కేసీఆర్ కాపాడుతారని చెప్పారు.  ఆంధ్రా ముసుగులో  వస్తున్న  లీడర్లను నమ్మొద్దన్నారు. జనం మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపిస్తారని తెలిపారు.  

కేసీఆర్ లేని తెలంగాణను  ఊహించుకునే పరిస్థితి  లేదన్నారు గంగుల. కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణ అని అన్నారు.  భూకబ్జా చేతుల్లోకి మతతత్వ పార్టీ చేతుల్లోకి అధికారం పోవద్దన్నారు. మళ్లీ బీఆర్ఎస్ కే అధికారం ఇవ్వాలని కోరారు. 

Also Read : ఎందుకు చేస్తున్నారో చెప్పండ్రా బాబూ : వందే భారత్ పై రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు

కాంగ్రెస్ బీఫామ్ లు  బీజేపీ ఆఫీసులో  తయారవుతాయంటూ సెటైర్లు  వేశారు గంగుల.  2019 లో ‌కూడా సర్వేలన్నీ కాంగ్రెస్ కే  అనుకూలమని చెప్పాయి.. కానీ తామే అధికారంలోకి వచ్చామన్నారు. ఇపుడు సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా విఫమైందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్..  కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలన్నారు.