కొత్తపల్లి, వెలుగు: తనను మరోసారి ఆశీర్వదిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు హ్యాట్రిక్ విజయాలను ఇచ్చిన నియోజకవర్గ ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తున్నాన్నారు. తొలుత రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గౌడసంఘం కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు. ఆలయ ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీరోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించారు. శాంతినగర్‌లోని సంత్ సేవాలాల్ ఆలయంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ, మేరిమా యాడి పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీలత-, జడ్పీటీసీ కరుణ-, ఏఎంసీ చైర్మన్ మధు, ఎంపీటీసీ తిరుపతినాయక్ పాల్గొన్నారు.