తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారు.. కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు : గంగుల కమలాకర్

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారు..  కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు : గంగుల కమలాకర్

కరీంనగర్ :  కాంగ్రెస్, బీజేపీ  పాలకులు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారన్నారని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు  చేశారు.  కొత్తపల్లి మండలం చింతకుంటలో బీఆర్ఎస్ యూత్ లీడర్లతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడారు. అధికారం ఢిల్లీ చేతిలో కాదని, కేసిఆర్ చేతిలో పెట్టాలని కోరారు.  తెలంగాణ ఉద్యమానికి  వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 

కేసీఆర్ లేని తెలంగాణ ని ఊహించుకొనే పరిస్థితి లేదని, కేసీఆర్ లెని తెలంగాణ ఆంటె నెర్రలు వారిన తెలంగాణనేనని చెప్పారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఓడిపోతానని భయపడి రెండవ స్థానంలో పోటీ చేస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ బీ ఫారాలు బీజేపీ ఆఫీసులో  బీజేపీ బీ ఫారాలు బీజేపీ ఆఫీసులో తయారవుతాయన్నారు. హైదరాబాద్  సంపద కొల్లగొట్టడానికే వీళ్లంతా వస్తున్నారని తెలిపారు. ప్రజలు మూడోసారి బీఆర్ఎస్ నే ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ : బీఆర్ఎస్లోకి పొన్నాల.. జనగామ టికెట్ కేటాయించే చాన్స్ !