కరీంనగర్ టౌన్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై ఈనెల 15న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సినీ, సంగీత కళాకారులు హాజరయ్యే ఈ కల్చరల్ ఫెస్ట్ కు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఫెస్ట్ ఏర్పాట్లకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాల నిర్వహణకు రాకపోకలను నిలిపివేసి, బ్రిడ్జిపైకి ప్రజలు కాలినడకన వచ్చేలా చూడాలన్నారు.
ఫుడ్ స్టాల్స్ ఆకట్టుకునే విధంగా ఉండాలని సూచించారు. శని, ఆదివారాల్లో సండే ఫన్ డే పేరుతో కేబుల్ బ్రిడ్జిపై కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు, ఉన్నారు.