కరీంనగర్ రూరల్ మండలంలోని దుబ్బపల్లి, ఫకీర్ పేట, జూబ్లీనగర్ ఏరియాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల బతుకులను చీకటి మయం చేసిందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మోసగాళ్ల పార్టీలన్నారు.
అందరినీ దోచుకుని బండి సంజయ్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఓటుకు రూ.20 వేలు ఇద్దామని వస్తున్నాడని, డబ్బు మాత్రం తీసుకుని.. కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ రహదారులన్నీ పూర్తి చేశానన్నారు.దుబ్బపల్లిని దత్తత తీసుకుని.. అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు.