- విద్యుత్ శాఖకు రూ.4 లక్షల చెక్కు అందజేసిన గంగుల
కరీంనగర్/ కరీంనగర్‌టౌన్, వెలుగు : కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు అవసరమైన కరెంట్ బిల్లులకు తానే సొంత నిధులు చెల్లిస్తానని బీసీ సంక్షేమం, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం రూ.4 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినాయక మండపాలకు కరెంట్ సౌకర్యంపై ఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ కరెంటు బిల్లుల పేరుతో మండప నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేయొద్దని విద్యుత్ అధికారులకు మంత్రి సూచించారు. శాంతియుత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్‌ఉన్‌నబీ పండుగలను జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో కలెక్టర్ బి.గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మేయర్ యాదగిరి సునీల్ రావు, జడ్పీ చైర్మన్ విజయ, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, పార్టీ అధ్యక్షుడు హరిశంకర్, ఎస్ఈ గంగాధర్, డీఈ రాజం ,టౌన్ ఏడీఈలు పాల్గొన్నారు..
రివర్ ఫ్రంట్‌కు ఎంట్రన్స్ ప్లాజాగా ఎల్లమ్మ టెంపుల్
మానేర్ రివర్ ఫ్రంట్ కు ఎంట్రన్స్ ప్లాజాగా ఎల్లమ్మ టెంపుల్ ను తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మేయర్ సునీల్ రావుతో కలసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగులను కోడూరి సత్యనారాయణ గౌడ్ శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, కార్పొరేటర్లు మహేందర్ యాదవ్, భూమా గౌడ్, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పవర్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్ స్వప్నికను స్థానిక మీసేవ ఆఫీసులో మంత్రి అభినందించారు.