సుప్రీంకోర్టు తీర్పు ఓ వార్నింగ్​లా ఉండాలి: గంగూలీ

సుప్రీంకోర్టు తీర్పు ఓ వార్నింగ్​లా ఉండాలి: గంగూలీ
  • కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా డాక్టర్​ కేసుపై సౌరవ్ గంగూలీ

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ట్రెయినీ డాక్టర్ రేప్​, మర్డర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్తులో ఇంకెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఓ హెచ్చరికలా ఉండాలని మాజీ క్రికెటర్​సౌరవ్​ గంగూలీ అన్నారు. అలాగే, వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలను నేను చదవలేదు. కానీ, ఈ తీర్పు యావత్ ప్రపంచానికి ఆదర్శం కావాలి. భవిష్యత్తులో ఇలాంటి నేరం గురించి ఏ వ్యక్తి కూడా ఆలోచించకూడదు. అది చాలా ముఖ్యం. ఈ ఉద్యమంలో ఉత్సాహంగా, రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న వారందరికీ న్యాయం జరగాలని కోరుకుంటు న్నాను’ అని గంగూలీ అన్నారు.