పంజాబ్ రైతులను మించిన ఉద్యమం చేస్తాం

కేంద్రం ధాన్యం కొనకపోతే పంజాబ్ రైతులను మించిన ఉద్యమం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్నే సాధించుకున్నామని..కేంద్రంతో వడ్లు ఎలా కొనిపించాలో తమకు బాగా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొంటామని చెప్పేదాకా ఇండ్లపై నల్ల జెండాలు ఎగురుతాయన్నారు.కరీంనగర్ జిల్లాలోని గ్రామాలతో పాటు.. రైతులకు మద్ధతుగా పట్టణాల్లోనూ నల్ల జెండాలు ఎగురవేస్తున్నారు.పార్టీలకతీతంగా జిల్లాలోని గ్రామాల్లోని 35 వేల ఇండ్లపై నల్ల జెండాలు ఎగురుతున్నాయని చెప్పారు. వడ్ల కొనుగోలుపై ఇవాళ కేంద్రం నుంచి  స్పష్టమైన ప్రకటన రాకపోతే  ఈనెల 11న ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్నిఉధృతం చేస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్