అలాంటి ప్లేయర్‌ను ఎందుకు వదులుకుంటాం

కెరీర్‌ కోసం ఏం చేయాలో రోహిత్‌కు తెలుసు

బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌, ఆస్ట్రేలియా టూర్‌‌తోనే తన కెరీర్‌‌ ముగిసిపోదన్న విషయం రోహిత్‌‌శర్మకు బాగా తెలుసని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ అన్నాడు. రీఎంట్రీ విషయంలో రోహిత్‌‌ సరైన నిర్ణయమే తీసుకుంటాడని దాదా పేర్కొన్నాడు. ఐపీఎల్‌‌ 13లో భాగంగా ముంబై ఇండియన్స్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ హ్యామ్‌‌స్ట్రింగ్‌‌(తొడ కండరాలు) ఇంజ్యురీకి గురయ్యాడు. దీంతో పలు మ్యాచ్‌‌లు మిస్సయ్యాడు. రోహిత్‌‌  ట్రెయినింగ్‌‌ స్టార్ట్‌‌ చేసినప్పటికీ ఆస్ట్రేలియా టూర్‌‌కు సెలెక్టర్లు అతన్ని పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో స్టార్ ఓపెనర్‌‌ సెలెక్షన్‌‌ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. ముంబై టీమ్‌‌ ఇచ్చిన  మెడికల్‌‌ రిపోర్ట్‌‌ ప్రకారం రోహిత్‌‌ మళ్లీ గాయపడే ముప్పు ఉందని, అందుకే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నారని టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి చెప్పాడు. కానీ సన్‌‌రైజర్స్‌‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ముంబైకర్‌‌ బరిలోకి దిగాడు.  అంతకంటే ముందు రోహిత్‌‌ సెలెక్షన్‌‌ అంశంపై సౌరవ్‌‌ గంగూలీ స్పందించాడు. రోహిత్‌‌ లాంటి బ్యాట్స్‌‌మన్‌‌ను తిరిగి జట్టులోకి చేర్చడం తమ బాధ్యతని దాదా అన్నాడు. ‘ ప్రస్తుతం రోహిత్‌‌ గాయపడ్డాడు. లేదంటే అలాంటి ప్లేయర్‌‌ను టీమ్‌‌లోకి ఎందుకు తీసుకోం. రోహిత్‌‌ ప్లేయర్‌‌ మాత్రమే కాదు. ఇండియా టీమ్‌‌కి వైస్‌‌ కెప్టెన్‌‌(లిమిటెడ్‌‌ ఓవర్స్)  కూడా. అతను ఎప్పటికి రికవర్‌‌ అవుతాడో నాకైతే తెలియదు. గాయమైన దగ్గర నుంచి ఆటకు మాత్రం దూరంగా ఉన్నాడు. అతను కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. రోహిత్‌‌ లాంటి బెస్ట్‌‌ ప్లేయర్‌‌ ఆడేందుకు సిద్ధంగా ఉంటే జట్టులోకి చేర్చడం బీసీసీఐ బాధ్యత’ అని దాదా చెప్పాడు. రోహిత్‌‌ ట్రెయినింగ్‌‌కు సంబంధించి ముంబై ఇండియన్స్‌‌ రిలీజ్‌‌ చేసిన వీడియోలపై కూడా సౌరవ్‌‌ స్పందించాడు. ‘ అతను మళ్లీ గాయపడాలని మేము కోరుకోవడం లేదు. అతనికి  హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీ అయ్యింది. అది తిరగబెట్టే డేంజర్‌‌ కూడా ఉంది. అదే జరిగితే రీఎంట్రీకి చాలా టైమ్‌‌ పడుతుంది. ఇప్పుడైతే రోహిత్‌‌ రికవరీ కోసం ముంబై ఇండియన్స్‌‌ ఫిజియోతోపాటు టీమిండియా ఫిజియో నితిన్‌‌ పటేల్‌‌ కూడా పని చేస్తున్నారు. పైగా ఈ ఐపీఎల్‌‌తోనో, తర్వాత జరగబోయే మరో సిరీస్‌‌తోనో అంతా అయిపోదని, తనకింకా లాంగ్‌‌ కెరీర్‌‌ ఉందని రోహిత్‌‌కి  బాగా తెలుసు. ఏం చేస్తే తనకు ప్లస్‌‌ అవుతుందో కూడా తెలుసు. అందువల్ల సరైన నిర్ణయమే తీసుకుంటాడు. నిజానికి, గాయం వల్ల ప్రాక్టీస్‌‌లో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మ్యాచ్‌‌లోనే సమస్య ఎదురవుతుంది. ప్రెజర్‌‌ సిచ్యువేషన్స్‌‌లో కండరాలపై ఒత్తిడి అధికంగా ఉంటుంది’ అని గంగూలీ వెల్లడించాడు.

For More News..

పెద్ద టీవీలకు ఫుల్ గిరాకీ

ఉద్యోగులకు దీపావళి కానుకిస్తున్న కంపెనీలు

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌‌ దక్కించుకున్న హైదరాబాద్