నిజామాబాద్​లో అర్ధరాత్రి గ్యాంగ్​వార్​.. కత్తులతో వీరంగం

నిజామాబాద్​లో అర్ధరాత్రి గ్యాంగ్​వార్​..  కత్తులతో వీరంగం

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్ ​నగరంలో శనివారం రాత్రి రెండు గ్యాంగ్​లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా జీజీహెచ్ ​హాస్పిటల్​లో చేర్పించారు. అయితే, ఆవేశం తగ్గించుకోని రెండు గ్యాంగ్​ల సభ్యులు అక్కడ కూడా కత్తులతో పొడుచుకోబోయారు. నగరంలోని డైరీ ఫాం ఏరియాకు చెందిన మహ్మద్​ అద్నాన్​  నలుగురు ఫ్రెండ్స్​తో కలిసి రాత్రి ధర్మపురి హిల్స్ వెళ్లాడు. అక్కడికి సమీర్, రెహాన్​ స్నేహితుల గ్రూప్​ రాగా  అడ్డుకున్నారు. రౌడీయిజం చెలాయించే  ఈ రెండు గ్రూప్​ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ సందర్భంగా రెండు గ్రూప్​లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోగా మహ్మద్​ అద్నాన్​ చేయి కట్​అయింది. సమీర్​, రెహాన్​లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జీజీహెచ్​ హాస్పిటల్​లో చేర్పించగా, ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు  హాస్పిటల్​లో కూడా కత్తులతో పొడుచుకోబోయారు. వన్ టౌన్​ పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరిమూకలను స్టేషన్​కు తరలించారు.