
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పయాత్ర సమావేశంలో గంజాయి కలకలం రేపింది. బీజేపీ సభలో ప్రజలకు గంజాయి విక్రయిస్తున్నాడనే అనుమానంతో హత్నూర మండలం దౌల్తాబాద్ కు చెందిన సన్నీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అతడి నుంచి గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.