పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 

పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు  యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాపై నిఘా పెట్టిన అధికారులు డుంబ్రిగూడ దగ్గర ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు. బొలెరో వెహికిల్ లోని వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని పరిశీలించి చూడగా.. వెహికల్ పైభాగంలో ఒక అర కనిపించింది. ఆ అరను ఓపెన్ చేసి చూడగా భారీగా గంజాయి పట్టుబడింది. 

పుష్ప సినిమా తరహాలో నిందితులు గంజాయి స్మగ్లింగ్ కు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 130 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.