రాష్ట్రంలో గంజాయి కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతోంది. డ్రగ్స్, గంజాయిపై ఉక్కపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయినా.. విచ్చల విడిగా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
కొయ్యగుట్టలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. శ్రీకాంత్ అనే వ్యక్త దగ్గర120 గ్రాముల గంజాయిని గుర్తించారు. అదుపులో తీసుకొని విచారణగా.. బోధన్ లోని రాకాసిపేటకు చెందిన నస్రీన్ బేగం ఇంట్లో మరో 500 గ్రాముల గంజాయి దొరికింది. శ్రీకాంత్ తోపాటు నస్రీన్, ఆమె మామ రషీద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.