ఏపీ నుంచి వస్తున్న రూ.20 లక్షలు విలువైన గంజాయి ఆయిల్ పట్టివేత

ఏపీ నుంచి వస్తున్న రూ.20 లక్షలు విలువైన గంజాయి ఆయిల్ పట్టివేత

గంజాయి ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరితో పాటు కస్టమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 2 లీటర్ల హాష్​ ఆయిల్​,3 సెల్​ఫోన్లు, ఒక కారు,  రూ.2500 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎల్​బీనగర్​ ఎస్​ఓటీ పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన కార్​మెకానిక్​పెరుసాముల  దినేష్​(28),  అల్లాపూర్​కు చెందిన కార్​పెయింటర్ అమర్తలూరి హానెస్ట్​(29) ఫ్రెండ్స్. దినేష్​ గతంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి  జైలుకు వెళ్లివచ్చాడు.

 వీరు ఈజీ మనీ కోసం హాష్​ ఆయిల్​ అమ్మాలని ప్లాన్ చేశారు.  ఏపీలోని వైజాగ్ జిల్లా నర్సిపట్నం వెళ్లి గంజాయి తెచ్చి సిటీలీఓ అమ్ముతూ జల్సాలు చేస్తున్నారు.  వీరి వద్ద  హాష్​ ఆయిల్ కొనుగోలు చేస్తున్న బోరబంకు చెందిన తాళ్లపల్లి భరణి(26) కూడా వెళ్తుండేవాడు. ముగ్గురూ కలిసి ఈనెల16న కారులో  నర్సీపట్నం వెళ్లారు.  రూ.50వేలకు లీటర్​ చొప్పున రెండు లీటర్ల హాష్​ ఆయిల్ కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. 

ముందస్తు సమాచారంతో  భువనగిరి పోలీసులు, ఎల్​బీనగర్​ ఎస్​ఓటీ పోలీసులు అనాజ్ పూర్ క్రాస్ రోడ్ వద్ద కారును ఆపి తనిఖీ చేశారు . కారులో  రెండు లీటర్ల హాష్​ ఆయిల్ దొరికింది. ముగ్గురిని అరెస్టు చేశారు. రెండు లీటర్ల హాష్ ఆయిల్ విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.