రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం (అక్టోబర్ 27) సెలవు కావటంతో కాటేదాన్ చౌరస్తా జనంతో రద్దీ ఉంది. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో పెట్టి ఇతర రాష్ట్రాల కార్మికులే లక్ష్యంగా విక్రయిస్తున్నాడు.
Also Read :- ఆదివారం(అక్టోబర్ 27) 50 విమానాలకు బాంబు బెదిరింపులు
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వెంటనే కాటేదాన్ చౌరస్తాకు చేరుకున్న పోలీసులు గంజాయి విక్రయిస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి కేజీ గంజాయితో పాటు వెయింగ్ మెషిన్‌ను సీజ్ చేశారు.