కోణార్క్ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో ఎండు గంజాయి పట్టివేత

కోణార్క్ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో ఎండు గంజాయి పట్టివేత

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎండు గంజాయిని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు మదన్ కుమార్, ఆనంద్ కుమార్ పాల్, రమేష్ దాస్, జీఆర్పీ ఎస్ఐ శంకరయ్య టీమ్ గురువారం రైళ్లలో తనిఖీలు చేపట్టింది. 

ఇందులో భాగంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నం.11020)లోని S4 కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా, బ్రౌన్ కలర్ ప్లాస్టిక్ టేప్‌తో చుట్టిన1 ప్యాకెట్‌తో కూడిన 01 అన్‌క్లెయిమ్ చేయని బ్యాగ్‌ కనిపించింది. విప్పి చూడగా అందులో 5 కిలోల ఎండు గంజాయి ఉంది. దాని విలువ రూ. 1.25 లక్షలు ఉంటుంది. గంజాయిని సీజ్ చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు.