గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్​

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్​

గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ చౌహాన్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన భువన్​సబీర్, వరుణ్​కుమార్​ఏపీలోని విశాఖపట్టణంలో నివసిస్తున్నారు. 

అక్కడ స్థానికంగా నివసిస్తున్న సురేష్​ అనే వ్యక్తి ద్వారా ఇద్దరు గంజాయి కొనుగోలు చేసేవారు. దాన్ని హైదరాబాద్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న ఎస్​ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి 100 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.