- ఇంట్లోకి చొరబడి కుటుంబంపై అటాక్
ఉప్పల్, వెలుగు: రామంతాపూర్లక్ష్మీశ్రీకాంత్ నగర్ కాలనీలోని ఇంట్లోకి చొరబడిన గంజాయి బ్యాచ్ యువకుడిపై దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలనీలో బాలనరసింహ తన ఇంటి ముందు ఆటో పార్క్ చేయగా, అందులో ముగ్గురు కూర్చుని గంజాయి తాగుతున్నారు.
ఇది చూసి ప్రశ్నించిన బాలనర సింహతో గొడవకు దిగారు. బాలనరసింహ కొడుకు భరత్ కూడా వచ్చి ప్రశ్నించగా..వారు కొంతమందిని పిలిపించుకున్నారు. తర్వాత భరత్ ఇంట్లోకి చొరబడి తలుపులు విరగ్గొట్టి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.