మైండ్ బ్లోయింగ్.. ఈ విషయం వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి.. అవును.. పసుపు ప్యాకెట్ల పేరుతో.. లోపల గంజాయి పెట్టి అమ్ముతున్న బాగోతం గుట్టు రట్టు అయ్యింది. సిటీ పోలీసులనే షాక్ కు గురి చేసిన ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిత్యావసర సరుకులు.. మనం పసుపు, కారం ప్యాకెట్లు సహజంగానే కొంటాం.. గల్లీ గల్లీ కిరాణా షాపుల్లో ఉంటాయి.. వాస్తవం అన్ని పసుపు ప్యాకెట్లలోనూ పసుపు ఉండదు.. అవును.. వాటిలో గంజాయి కూడా ఉంటుంది.. ఇప్పుడు హైదరాబాద్ సిటీ జనాన్ని షాక్ కు గురి చేసింది ఈ ఘటన.. దూల్ పేటకు చెందిన నేహా అనే మహిళ.. స్వయం ఉపాధి కింది పసుపు ప్యాకెట్లు తయారీ కేంద్రం పెట్టింది. చేసేది మాత్రం గంజాయి సప్లయ్ అవును.. ఆ పసుపు ప్యాకెట్లలో పసుపు ఉండదు.. గంజాయి పెట్టి సిటీ మొత్తం అమ్మేస్తుందంట.. ఎవరికీ అనుమానం రాకుండా పసుపు ప్యాకెట్లు అని చెప్పి.. ఇన్నాళ్లు అందర్నీ బురిడీ కొట్టించిందంట.
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు వచ్చిన సమాచారం.. నిఘా పెట్టి దాడి చేయగా అడ్డంగా దొరికిపోయింది నేహా అనే మహిళ. పేరు ఏంటో తెలుసా అట్లాస్ టర్నరిక్ పౌడర్ అనే పేరుతో గంజాయి వ్యాపారం చేస్తుందీ మహిళ..
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులే ఇలాంటి దందా చూసి షాక్ అయ్యారు. ఎవరైనా పసుపు ప్యాకెట్ అంటే లైట్ తీసుకుంటారు.. ఇప్పుడు అదే ఆమెకు వ్యాపారం అయ్యింది. మొత్తానికి పసుపు ప్యాకెట్లలో గంజాయి మాత్రం పెద్ద షాకింగ్ గా మారింది.
నేహా భాయ్ అని దూల్పేట్ కి చెందిన మహిళ..పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డి.ఎస్.పి తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజ్ తో పాటు సిబ్బంది కలిసి.. గంజాయి పసుపు ప్యాకెట్ లో 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.