హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపుతోంది. జూనియర్ డాక్టర్లకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు గంజాయి ఫెడ్లర్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో , సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై గతంలో ఐదు కేసులు నమోదు అయ్యాయి.
జూలై 5న ఉదయం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ దగ్గర జూనియర్ డాక్టర్లు కె మణికందన్ , డాక్టర్ వి అరవింద్ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఆరుగురు మెడికోలు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిపై ఇద్దరు మెడికోలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 80 గ్రాముల గంజాయి , 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఇద్దరు జూనియర్ డాక్టర్ లతో పాటు ఇద్దరు గంజాయి పెడ్లర్లను సుల్తాన్ బజార్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.