హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. అయితే తిరిగి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయింది గంజాయి ముఠా..తర్వాత వెంటాడి గంజాయి ముఠాను పట్టుకున్నారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్ ఒడిస్సా చెందిన వారి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుంచి దాదాపుగా 200 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిస్సా కు చెందిన ఒక కారుని ఒక రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. . కేసు నమోదు చేసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
Also Read:-వాళ్లు వరదల్లో కొట్టుకుపోతే.. మేం జీతం ఎందుకు ఇవ్వాలి
హర్యానాకు సంబంధించిన వ్యక్తులు ఈ గంజాయిని ఎక్కడినుంచి చేస్తున్నారనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.