120 కిలోల గంజాయి పట్టివేత.. వాహన తనిఖీల్లో గుట్టురట్టు

గుట్టుచప్పుప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరెట్ పరిధిలో ఉన్న కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్ఓటి, రామచంద్రాపురం పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 120 కిలోల గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మేడ్చల్ కు చెందిన నిందితులు ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలించే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు వివరించారు. ఈ ఘటనలోవారి వద్ద నుంచి రూ. 50 లక్షల 90 వేల రూపాయల విలువ చేసే గంజాయితో పాటు రెండు కార్లు, ఒక బైక్, సెల్ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముగ్గురు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నారు.