గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్​.. 1.5 కిలోల గంజాయి సీజ్​

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్​.. 1.5 కిలోల గంజాయి సీజ్​

 గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ, ఆదిబట్ల పోలీసులు  పట్టుకున్నారు.  సీఐ రాఘవెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్నపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్  అనే వ్యక్తి.. తుర్కయంజాల్ మునిసిపాలిటీ రాగన్నగూడాలో మహమ్మద్ సమీర్ అలియాస్ ఫరీద్  నివాసం ఉంటున్నాడు. 

ఫరీదు కారు డ్రైవింగ్​ చేస్తూ  అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1.2 కేజీల గంజాయి, ఒక స్విఫ్ట్ కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.  మహమ్మద్ సమీర్ గతంలో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.