లైవ్ అప్డేట్స్: హైదరాబాద్లో శోభాయాత్ర

లైవ్ అప్డేట్స్: హైదరాబాద్లో  శోభాయాత్ర

హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణేష్ శోభాయాత్రతో సందడి నెలకొంది. బ్యాండ్ బాజాలతో,డప్పుచప్పుళ్లతో భక్తులు డ్యాన్సులు చేస్తూ  శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. వరుసగా వస్తున్న గణనాథులను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేలాది గణపతి విగ్రహాలను  ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేస్తున్నారు. భక్తుల కోలాహలంతో ట్యాంక్ బండ్ పై సందడి నెలకొంది.  జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకు పైగా విగ్రహాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

 

  • తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద ఊపందుకున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర..
  • సాగర తీరానికి క్యూ కట్టిన గణనాధులు
  • తీన్మార్ డాన్సులు, డీజే పాటలతో ఫుల్ జోష్ గా సాగుతున్న గణేష్ శోభాయాత్ర..
  • నిమజ్జనని వీక్షించడానికి భారీగా తరలివచ్చిన భక్తులు..
  • రోప్ టీమ్స్ ద్వారా భక్తులను కట్టడి చేస్తున్న పోలీసులు..
  • తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ కు తరలివెళ్తున్న గణనాధులు...
  •  రాణిగంజ్ టూ ట్యాంక్ బండ్ రోడ్డు...చిన్నా పెద్దలు తేడా లేకుండా గణపతి నిమజ్జన ఉత్సవాలను చూడడానికి వస్తున్నారు.
  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.
  •  
  • నార్త్ జోన్ సికింద్రాబాద్ నుండి మొదలైన గణనాథులు
  • నిమజ్జనం ఉత్సవాలను వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజలు...

  • MJ మార్కెట్ వద్ద రెండు వైపుల కొనసాగుతున్న గణేష్ నిమజ్జన యాత్ర

  • ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుండి తక్కువ సంఖ్యలోనే గణేషులు 

  • పాతబస్తీలో ప్రశాంత వాతావరణంలో వినాయక శోభయాత్ర కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు చార్మినార్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. 
  • ఉదయం బాలాపూర్ గణేష్ నిమజ్జనంపై ఫోకస్ పెట్టడంతో సాయంత్రంపూట భారీగా తరలి వస్తున్న గణనాథులు.  
  • నవయువక యూత్  అససియేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి మూసపేటలో భారీ గణనాథుని నిమజ్జనానికి తరలివచ్చింది 
  • రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్ పత్తి కుంట చెరువు లో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.  చేవెళ్ల మొయినాబాద్ నాగిరెడ్డి గూడెంతో పాటు అజిజ్ నగర్, రాజేంద్రనగర్ అత్తాపూర్ హైదర్ గూడా తదితర ప్రాంతాలకు చెందిన భారీ గణనాథులను  రాజేంద్రనగర్ పత్తికొండలో నిమజ్జనం చేశారు.  పత్తి కుంట చెరువు వద్ద భారీ మూడు క్రేన్లను ఏర్పాటు చేశారు...