వైసీపీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన ఇవాళ ( జనవరి 25, 2025 ) ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలో, విజయసాయిరెడ్డి రాజీనామాపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇక్కట్లు, వారి విధ్వంసం, దాడులను ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అని గతంలోనే చెప్పానని.. ఇప్పడు అది నిజం కాబోతోందని అన్నారు గంటా. వైసీపీ నేతలు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఇప్పటికీ కూడా వక్రంగానే మాట్లాడుతున్నారని అన్నారు.
ALSO READ | రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని... సీఎం చంద్రబాబు దావోస్‌లో పారిశ్రామివేత్తల్లో నమ్మకం కలిగేలా చేసి.. ఏపీ బ్రాండ్‌ను వివరించారని అన్నారు గంటా శ్రీనివాసరావు.