భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) లిరిక్ రైటర్ అవతారం ఎత్తారు. ఆయన రాసిన ఓ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బో సాంగ్(Garbo Song) ను రాశారు ప్రధాని మోదీ..ఈ పాట యూ ట్యూబ్ లో రిలీజ్ అయి ట్రెండ్ అవుతోంది.
ఈ గర్బో సాంగ్ ను ధ్వని భానుశాలి పాడగా..తనిష్క్ బాగ్చి సంగీతాన్ని సమకూర్చారు. ఈ వీడియోకు నదీమ్ షా డైరెక్ట్ చేశారు. 190 సెకన్లు ఉన్న ఈ వీడియోపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ పాటను కొన్నేళ్ల క్రితమే రాశానని మోదీ తెలిపారు. ఈ పాట రూపకల్పనలో భాగమైనవారికి కృతజ్ఞతలు..ఈ పాట అనేక జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చిందని చెప్పారు.
Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023
గుజరాతీలు నవరాత్రుల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గర్బా(Garba) డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో మోదీ రాసిన గర్బా సాంగ్తో మ్యూజిక్ వీడియో (Garbo Video ) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాట అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కొంత మందైతే..మోదీ ఈ పాట రాశారంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. చాలా గొప్ప సాహిత్యం, మంచి సంగీతంతో కూడిన ఈ పాటపై సినిమా ఇండస్ట్రీల ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ నవరాత్రికి..మోదీ రాసిన గార్భా సాంగ్ అనేక రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా. ఈ పాటకు 10 గంటల్లోనే 22 లక్షల వ్యూస్ రావడం విశేషం.