జనగామ టౌన్‌లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మున్సిపల్ ఆఫీసర్ల పర్యవేక్షణా లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. డ్రైనేజీలు కొన్నిచోట్ల పూర్తిగా పూడుకుపోగా, మరికొన్ని చోట్ల చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటిళ్లతో నిండిపోయాయి.
డ్రైనేజీలను క్లీన్ చేయించాలని జనరల్ బాడీ మీటింగ్‌లో కౌన్సిలర్లు ఎంత చెప్పినా ఫలితం కనిపించడం లేదు. మున్సిపల్ వైస్‌చైర్మన్ మేకల రాంప్రసాద్ వార్డులో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న డ్రైనేజీ చెత్తతో నిండిపోయింది. భారీ వర్షాలు పడితే వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి సమీప ఇండ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- జనగామ అర్బన్, వెలుగు