ఏపీలో చెత్త రాజకీయం నడుస్తుంది.. చెత్తపై పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చెత్తపై పన్ను ఎత్తివేసింది ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు చెత్త పన్ను కొత్త టర్న్ తీసుకున్నది.
కడప మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. చెత్త పన్ను కట్టకపోతే.. చెత్త ఎత్తేది లేదని.. చెత్త ఏరివేత కుదరదని మేయర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కడప జనం.. మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించింది. మేయర్ ఇంట్లో చెత్త వేశారు. చెత్తను తీసుకెళ్లి.. మేయర్ ఇంట్లోకి వేశారు జనం. దీనికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి సైతం మద్దతు తెలపటం విశేషం.
చెత్తపై పన్ను ఎలా వేస్తారండీ.. కడప మేయర్ ఇంట్లో చెత్త పోసిన జనం #tdp #YSRCP #kadapa #andhrapradesh#appolitics pic.twitter.com/m4UsTsBbr8
— raghu addanki (@raghuaddanki1) August 27, 2024
Also Read:-డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌ను కలిసిన రష్యా వ్యోమగామి
ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన మాధవిరెడ్డి కొనసాగుతున్నారు. గత ఎన్నికల ప్రచారంలో చెత్త పన్ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కార్పొరేషన్ చెత్త పన్ను వేయటాన్ని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే మేయర్ ఇంట్లో చెత్త వేస్తున్న జనానికి మద్దతు తెలిపారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి.
దీనిపై మేయర్ సురేష్ బాబు వివరణ ఇచ్చారు. చెత్త పన్ను రద్దు చేయాలని.. చెత్త పన్ను వేయొద్దంటూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు, జీవో రాలేదని చెబుతున్నారు.