దమ్మాయిగూడలో నడి రోడ్డుపై చెత్త లారీ దగ్ధం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో దమ్మాయి గూడలో చెత్త లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది.  డంపింగ్ యార్డుకు  వెళ్తుండగా అహ్మద్ గూడ సాయిబాబా ఆలయం దగ్గరకు రాగానే లారీలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెత్త లారీలోనీ సెల్ఫ్ మోటార్ లో మంటలు రావడంతో డ్రైవర్ సతీష్ లారీని పక్కకు ఆపేశారు.మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు కానీ ఒక్కసారిగా మంటలు రావడంతో బయంతో డ్రైవర్ దూరం వెళ్లాడు. 

 ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.