నీలాంటి వాళ్లు సినిమా రంగానికి కావాలి..సాయి పల్లవి పై గరికిపాటి కామెంట్స్

నీలాంటి వాళ్లు సినిమా రంగానికి కావాలి..సాయి పల్లవి పై గరికిపాటి కామెంట్స్

పదునైన ఛలోక్తులు, సందర్భానుసార సామెతలతో అందరినీ కట్టి పడేస్తూ..ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) ఎంతో ప్రత్యేకం. ఈ పేరు వినని తెలుగు మేధావులు లేరు. తెలుగు అభిమానులు లేరు. గరికిపాటి తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేసి మంచి గుర్తింపు పొందాడు. అలాంటి సాహిత్య, ఆధ్యాత్మిక మేధావి నోట..సాయి  పల్లవి(Sai Pallavi) మాట్లాడిన మాటలు ఆశ్చర్యం..ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. 

డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి సహజ నటన..సినిమాల్లో సహజంగా కనిపించే తీరు తెన్నులు ప్రేక్షకులకు మంచి అభిప్రాయం కలుగజేస్తాయి. గతంలో సాయి పల్లవి మాట్లాడిన తీరుపై గరికపాటి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇస్తున్న మాటలు..ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గరికపాటి  ప్రశంసలు ఇచ్చే విధంగా..సాయి పల్లవి మాట్లాడిన మాటలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారా..?వివరాల్లోకి వెళితే..సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'నా దగ్గరికి వచ్చే అన్నీ కథలను చూస్తాను. కానీ, నేను అన్ని పాత్రలు చేయడానికి ఒప్పుకోను. కథ విన్నాక నాకు..నా నటనకి తగినది అనిపిస్తేనే చేస్తాను..లేకపోతే సున్నితంగా అవకాశం వదిలేస్తాను..అని చెప్పింది.

అంతేకాదు..ప్రసెంట్ వచ్చే ఎలాంటి సినిమాలో అయిన హీరోయిన్స్ అట్ట్రాక్టీవ్ గా ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఇదే విషయంలో సాయి పల్లవి మాట్లాడుతూ..నేను ఎప్పుడు పొట్టి దుస్తులు వేయనని..నాకు అవి సౌకర్యంగా ఉండవని తెలిపింది. ఎప్పటికైనా మా తల్లిదండ్రులు నా సినిమాలు చూసి గర్వించాలి. నా పిల్లలు పెద్దయ్యాక కూడా గర్వంగా నా సినిమాలు చూడాలని..సాయి పల్లవి తన మనసులో మాట వెల్లడించింది.

ఈ మాటలపై గరికపాటి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ..‘సినిమా రంగంలో చూసి మా అమ్మాయి లాంటిది అనుకున్న. సాయి పల్లవి మాటలు నన్ను అంత ఆకర్షించాయి. సాయి పల్లవిది ఎంత చక్కటి నవ్వు. సినిమాల్లోకి మెల్ల మెల్లగా వచ్చింది..క్రీమ్ బిస్కెట్ వేసింది. నీకు నమస్కారం అమ్మ. నా కంటే చిన్నదానివైనా నీకు నమస్కారం పెట్టాలి తల్లి. నీలాంటి వాళ్లు సినిమా రంగానికి కావాలి..కలకాలం చాలా హ్యాపీగా ఉండాలి అంటూ సాయి పల్లవిపై గరికపాటి ప్రశంసలు కురిపించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AJ MEMES (@arrey_jaffaa)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ..ఇది కదా సాయి పల్లవి అంటే..చాలా గర్వంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి..నాగ చైతన్యతో తండేల్ అనే మూవీలో నటిస్తుంది.