
చేర్యాల, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచినన నకాషీ చిత్ర కళను(చేర్యాల పెయింటింగ్స్) ఖండాంతరాలకు వ్యాప్తి చేయాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని నాగిల్ల వనజ గణేశ్ వేసిన చేర్యాల పెయింటింగ్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, తదితర కూడళ్లలో ఈ పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.