వార్సా: రష్యన్ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్(60)ను ఆ దేశం టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పుతిన్‌కు కాస్పరోవ్ దీర్ఘకాల ప్రత్యర్థిగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా కూడా ఆయన విమర్శలు చేశారు.
అయితే, కాస్పరోవ్‌ను ఈ లిస్టులో ఎందుకు చేర్చారో రష్యా ఆర్థిక నిఘా సంస్థ రోస్ఫిన్ మానిటరింగ్ బయటపెట్టలేదు. కాగా, ఆ దేశంలో టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన వారి బ్యాంక్ ఖాతాలపై ఆంక్షలు విధిస్తారు. పుతిన్ ప్రభుత్వ అణచివేత, ప్రతీకార దాడులకు భయపడి కాస్పరోవ్ రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేండ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు.