పాకిస్థాన్ క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక అంచనాకు రావడం కష్టం. కెప్టెన్ దగ్గర నుంచి కోచ్ వరకు ఎవరు రాజీనామా చేస్తారో.. ఎవరు ఎంపికవుతారో చెప్పలేం. ముఖ్యంగా గత ఏడాది కాలంగా పాకిస్థాన్ క్రికెట్ లో గందర గోల పరిస్థితులు నెలకొన్నాయి. కెప్టెన్ లు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ మారుతూ వస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ వన్డే, టీ20 జట్ల ప్రధాన కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 2024లో రెండేళ్ల కాంట్రాక్ట్‌పై పీసీబీచే నియమించబడిన కిర్‌స్టన్.. కేవలం ఆరు నెలలు మాత్రమే పాక్ జట్టులో కొనసాగారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆదివారం (ఫిబ్రవరి 28) వన్డే, టీ 20 లకు ప్రధాన కోచ్‌గా ప్రపంచ కప్ విజేత గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించింది. టెస్టులకు మాత్రం ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీను ప్రధాన కోచ్ గా ఎంపిక చేశారు. వస్తున్న సమాచార ప్రకారం కిర్‌స్టన్, జాసన్ గిల్లెస్పీ, పాక్ క్రికెట్ బోర్డు మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ గా భారత్ 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. పాక్ కోచ్ గా మాత్రం అతనికి చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి.
Also Read:-ఆఫ్ఘనిస్తాన్ కుర్రాళ్ళు సంచలనం..
ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. సౌతాఫ్రికా తరపున కిర్ స్టన్ 101 టెస్టుల్లో 45 యావరేజ్ తో 7289 పరుగులు చేశాడు. 21 సెంచరీలు.. 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 185 వన్డేల్లో 40 యావరేజ్ తో 6798 పరుగులు చేశాడు. వీటిలో 13 సెంచరీలు.. 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ విషయానికి వస్తే ఆదివారం (అక్టోబర్ 27) మహమ్మద్ మహ్మద్ రిజ్వాన్ ను వన్డే, టీ20 ఫార్మాట్లకు కెప్టెన్ గా ప్రకటించారు.
🚨 Gary Kirsten, who signed a two-year contract in April with the PCB, has stepped down barely six months into the role
— ESPNcricinfo (@ESPNcricinfo) October 28, 2024
Full story 👉 https://t.co/UQrMsel61K pic.twitter.com/ar9xDBLUDb