పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఎప్పుడూ ఇదొక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. వివాదాలు, విమర్శలు, ఓటములు ఆ జట్టుకు కొత్తేమి కాదు. వెస్టిండీస్, యుఎస్‌ఎ వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ లో కనీసం సూపర్ 8కు కూడా అర్హత సాధించలేని పాక్ జట్టుపై విమర్శలు తెగ వస్తున్నాయి. ఆ దేశ మాజీల నుంచి అభిమానుల వరకు పాక్ జట్టుపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తన జట్టుపై తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
టోర్నమెంట్ నుంచి పాక్ జట్టు నిష్క్రమించిన తర్వాత కిర్‌స్టన్ జట్టు ఐక్యత, ఫిట్‌నెస్ స్థాయిల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. నివేదికల ప్రకారం.. "పాకిస్తాన్ జట్టులో ఐక్యత లేదు. అసలు ఇది జట్టు అని పిలవడం కరెక్ట్ కాదు. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోరు. ఎవరి దారి వారిదే. జట్టులో అందరూ విడిపోయారు. నేను చాలా జట్లతో కలిసి పనిచేశాను కానీ నాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు". అని కిర్‌స్టన్ విచారం వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) 2024 ఫిబ్రవరి 28న వన్డే, టీ20 లకు ప్రధాన కోచ్‌గా ప్రపంచ కప్ విజేత గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించింది. పాకిస్థాన్ కోచ్ గా ఇంగ్లాండ్ పర్యటన నుంచి ఈ మాజీ సౌతాఫ్రికా బ్యాటర్ బాధ్యతలు చేపట్టగా.. ఈ సిరీస్ ను పాక్ కోల్పోయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రెండు విజయాలు.. రెండు పరాజయాలతో సూపర్ 8 లోకి అడుగుపెట్టకుండానే ఇంటిదారి పట్టింది. గతంలో భారత కోచ్ గా కిర్‌స్టెన్ వన్డే వరల్డ్ కప్ అందించాడు. అయితే టీ20ల్లో మాత్రం ఇతని రికార్డ్ పేలవంగా ఉంది. 2009, 2010 టీ20 వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8 లోనే నిష్క్రమించింది.
A huge statement from the Pakistan head coach Gary Kirsten! 👀#GaryKirsten #Pakistan #T20WorldCup pic.twitter.com/klxt5fYHtM
— Sportskeeda (@Sportskeeda) June 17, 2024