కరాచీ : పాకిస్తాన్ వన్డే, టీ20 కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో విభేదాల కారణంగా ఆరు నెలల్లోనే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. సౌతాఫ్రికాకు చెందిన 56 ఏండ్ల గ్యారీని
ఈ ఏడాది ఏప్రిల్‌లో పీసీబీ కోచ్‌గా నియమించింది. అతను ఇచ్చిన రాజీనామాను అంగీకరించినట్టు పీసీబీ సోమవారం తెలిపింది. గ్యారీ స్థానంలో జాన్సన్ గిల్లిస్పీ వచ్చే నెల ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే పాక్ వైట్ బాల్ టీమ్‌కు కోచ్‌గా పని చేస్తాడని ప్రకటించింది.