- సూర్యాపేట జిల్లా పాత కొండాపురంలో ప్రమాదం
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని పాత కొండాపురంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ మంటలు అంటుకుని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిలుకూరు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మేరిగ గురవయ్య ఇంట్లో కోడలు శిరీష బుధవారం వంట చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలింగించింది.
ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో శిరీషతో పాటు ఇంట్లో ఉన్న గురవయ్య, అతడి కొడుకు అరుణ్ గోపాల్ కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు మంటలార్పి గాయపడ్డవారిని కోదాడ ప్రభుత్వ దవాఖానకు,అక్కడి నుంచి హైదారాబాద్ తరలించారు. సిలిండర్లో కొంచమే గ్యాస్ఉందని, ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.