హైదరాబాద్ కూకట్పల్లిలో పేలుడు.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఇవే..

హైదరాబాద్ కూకట్పల్లిలో పేలుడు.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఇవే..

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది.. మంగళవారం ( మార్చి 4, 2025 ) జరిగిన ఈ ఘటనలో ఒక వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విరాలిలాఉన్నాయి.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ లోని ఓ గ్యాస్ సర్వీస్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలిడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

జయ భవాని గోల్డెన్ ఇన్ఫోసిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ లో  డొమెస్టిక్ సిలిండర్ నుండి చిన్న సిలిండర్ లోకి అక్రమంగా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. 

Also Read:-అంబర్ పేట కొత్త ఫ్లై ఓవర్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం..

ఈ ఘటనతో చుట్టుపక్కల ఉండేవారు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు దాటికి షాపు మొత్తం ధ్వంసమైంది. ప్రస్తుతం క్షతగాత్రుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నివాసాల వద్ద ఇటువంటి ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేసే షాపులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.