కమలాపూర్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగి రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన శనిగరపు రమేశ్ ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకైంది.
ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇరుగుపొరుగు వారు, స్థానిక యువకులు వచ్చి సిలిండర్ఆఫ్చేసి ఇంట్లోని వారిని బయటకు తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా మిక్సీ, నిత్యావసర వస్తువులు, బియ్యం, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.