యూపీలో అగ్నిప్రమాదం..గ్యాస్ సిలిండర్ల ట్రక్కులో పేలుడు.. భయంతో జనం పరుగులు

యూపీలో అగ్నిప్రమాదం..గ్యాస్ సిలిండర్ల ట్రక్కులో పేలుడు.. భయంతో జనం పరుగులు

ఉత్తరప్రదేశ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ లో శనివారం (ఫిబ్రవరి1) తెల్లవారు జామున ఎల్ పీజీ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. చెక్క గోడౌన్ సహా చుట్టు పక్కలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ముందస్తుగా స్థానికులను ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. వజీరాబాద్ రోడ్ లోని భోపురా చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

Also Read :- బస్టాండ్, రద్దీ ప్రదేశాలేలక్ష్యంగా చోరీలు

ఘటనా స్థలంలో మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే నిరంతరాయంగా సిలిండర్లు పేలుతుండటంతో ట్రక్కును సమీపించడం ఫైర్ సిబ్బందికి సాధ్యం కావడంలేదు. సంఘటన స్థలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా పెద్దగా పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల తీవ్రతను మూడు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.