అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ లో లీకైన గ్యాస్

అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ లో లీకైన గ్యాస్
  • స్వల్ప అస్వస్థతకు గురైన సమీప గ్రామాల ప్రజలు 

మణుగూరు, వెలుగు : భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని హెవీ వాటర్ ప్లాంట్ లో గ్యాస్ లీకైన ఘటనలో  సమీప గ్రామాల్లో పలువురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం సరిహద్దుల్లోని అణు ఇంధనానికి చెందిన భార జల కర్మాగారం నుంచి మంగళవారం రాత్రి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై,  కుళ్లిన కోడి గుడ్డు వాసన రావడంతో వాంతులు, తలనొప్పితో  ఇబ్బందులు పడినట్టు పలువురు తెలిపారు.

ప్లాంట్ లో స్వల్పంగా గ్యాస్ లీక్ అవడంతో ఇలా అయిందని, అదే భారీగా గ్యాస్ లీకైతే తీవ్ర ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా తగు భద్రత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.