ఛత్తీస్ గఢ్ రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలన్నరోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడవంతో దేశంలో పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.
ఇవాళ (గురువారం) ఉదయం విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ లీకైంది.ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 10 మంది చనిపోగా…అనేక మంది అస్వస్థతకు గురయ్యారు.