ఫిల్టర్ బెడ్లో గ్యాస్ లీక్.. ఇద్దరికి అస్వస్థత

కరీంనగర్ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం సృష్టించింది. ఎల్ఎండి ఫిల్టర్ బెడ్ లోని హైడ్రో క్లోరిన్ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది.ఫిల్టర్ బెడ్ వాల్ బ్లాక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్లాంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఎల్ఎండి ఫిల్టర్ బెడ్స్ లో నీటి శుద్ధి కోసం గ్యాస్ ను  వినియోగిస్తారు. 

లీకైన హైడ్రో క్లోరిన్ గ్యాస్ ప్లాంట్ అంతటా వ్యాపించడంతో ప్లాంట్ నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చారు. అయితే గ్యాస్ లీక్ ను అదుపులోకి తెస్తున్న క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.