
కుత్బుల్లాపూర్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. సూరారంలోని నారయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు మెయిన్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకేజీ గురించి తెలియడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న భాగ్యలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. అసలేం జరిగింది.. దీనికి గల కారణాలేంటని అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలో భారీగా జనాలు గుమిగూడారు.దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. గ్యాస్ పైప్ లో నుంచి మంటలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.