ధర్మసాగర్, వెలుగు : గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్‌లో గురువారం జరిగింది. తమిళనాడుకు చెందిన నటరాజన్ (46) హెచ్‌పీ గ్యాస్ లోడ్ ట్యాంకర్‌తో హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్యాస్ బోటింగ్ యూనిట్‌కు రాంపూర్ రింగ్ రోడ్డు మీదుగా వస్తున్నాడు. ఈ క్రమంలో ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రాంపూర్ రంగసముద్రం చెరువులో పల్టీ కొట్టింది.
ప్రమాదంలో డ్రైవర్ నటరాజన్ స్పాట్‌లోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గ్యాస్ కంపెనీ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్లు వచ్చి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న గ్యాస్ కంపెనీ మేనేజ్‌మెంట్ ట్యాంకర్‌ను పరిశీలించి గ్యాస్ లీక్ కాలేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్ డెడ్‌బాడీని బయటకు తీసి ఎంజీఎంకు తరలించినట్లు ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావు చెప్పారు.