న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాండ్ గన్ సృష్టికర్త, ఆస్ట్రియన్ ఇంజినీర్ గాస్టన్ గ్లాక్ (94) కన్నుమూశారు. ఈ విషయాన్ని గ్లాక్ కంపె నీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గాస్టన్ రూపొందించిన గన్‌ను పోలీ సులు, మిలిటరీలో ఎక్కువగా వాడతారు. గాస్టన్ 1980లో గ్లాక్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించి, తొలుత సైనిక కత్తు లు, కర్టెన్ రాడ్‌లతో సహా నిత్యావసర వస్తువులను తయారు చేశారు.
ఆ తర్వా త ఆస్ట్రియన్ మిలిటరీ కొత్త, వినూత్నమైన గన్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ హ్యాండ్ గన్‌ను రూపొందించారు. తేలికైన సెమీ ఆటోమేటిక్ తుపాకీని ఎక్కువగా ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఈ గన్ 18 రౌండ్లు కాల్పులు జరపగలదు. దీంతో అత్యంత తక్కువ సమయంలోనే ఈ గన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఆయన బిజినెస్ రోజురోజుకూ అభివృద్ధి చెందడంతో 2021లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం అతని కుటుంబ సంపద 1.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది.