గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్బీ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్బీ విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు. ఐఎస్బీ స్టూడెంట్స్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందంటూ.. న్యూయార్క్... పారిస్ సిటీలతో హైదరాబాద్ పోటీపడాలన్నారు. ఐఎస్ బీ లీడర్ షిప్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్న సీఎం .. గొప్ప లీడర్ కావాలంటే ప్రజలతో మమేకం అవ్వాల్సిందే నన్నారు, తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
సౌత్ కొరియా సహకారంతో యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీని నిర్మించామన్నారు. ధనక, పేద అనే తేడా లేకుండా అందరికి అవకాశం ఇవ్వాలన్నారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇచ్చినంత జీతం ఇవ్వకున్నా.. అంతకు మించి అవకాశాలను కల్పిస్తామన్నారు. - స్కిల్ యూనివర్సిటీ తో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ని కూడా నిర్మిస్తామన్నారు. - ఒలంపిక్స్ లో భారత్ కి అత్యధికంగా మెడల్స్ అందించే వాళ్ళు మన హైదరాబాద్ నుంచే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.